15-07-2025 12:32:29 AM
పార్టీ కండువాలు వేసి వేసి ఆహ్వానం పలికిన షబ్బీర్ అలీ
కామారెడ్డి, జూలై 14 (విజయ క్రాంతి), కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై సోమవారం టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన 50 మంది బిఆర్‌ఎస్, బిజెపి లకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై భిక్కనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థ ులు గెలిచే విధంగా ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, మహమ్మద్ ఇలియాస్, భిక్కనూరు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.