calender_icon.png 24 July, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాసంస్థల బంద్ విజయవంతం

23-07-2025 07:36:45 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): ఏఐఎస్ఎఫ్ , వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా(Karimnagar district) హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలో   ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో బంద్ కార్యక్రమం బుధవారం విజయవంతమైంది. అనంతరం  ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ మాట్లాడుతూ.... రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  ఫుడ్ పాయిజన్ తో చనిపోయినటువంటి విద్యార్థులను వారి కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కనీసం చదువుకోవడానికి తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని, మధ్యాహ్న భోజనం ఆరు బయట చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తాం, హాస్టల్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి నమ్మించి విద్యార్థులను మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో టిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాంపేల్లి రోహిత్, మండల నాయకులు రాహుల్,గణేష్, రాజేష్  తదితరులు పాల్గొన్నారు.