23-07-2025 07:35:53 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ జిపి ఆఫీస్ ఆపరేటర్లు జన్నుబాయి, సుదర్శన్ పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయ్యాలని అన్నారు. బుధవారం సిర్గాపూర్ మండల పరిషత్ ఆఫీస్ లో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీవో బ్రహ్మయ్యకు వినతి పత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. తమకు చెల్లించాల్సిన వేతనం రూ.22,750 కి బదులు రూ.19,500 కుదించి వ్యక్తిగత ఖాతాలో జమ చేయ్యడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోయారు. అలాగే గురువారం విధులు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.