05-08-2025 06:33:56 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో గల రాంపూర్ ఐటీడీఏ పాఠశాల విద్యార్థులకు మంగళవారం మాదిగ హక్కుల దండోరా సంఘం కాసిపేట మండల అధ్యక్షులు అటకపురం రమేష్ ఆధ్వర్యంలో పలకలు, స్కూల్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్ళతోపాటు ముగ్గురు విద్యార్థులకు పాదరక్షలు అందజేశారు. మాదిగ హక్కుల దండోరా సంఘం ఆధ్వర్యంలో గిరిజన వసతి గృహాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు తమ వంతుగా సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.