calender_icon.png 5 August, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

05-08-2025 06:37:33 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పలు అంగన్వాడి కేంద్రాల్లో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను అంగన్వాడి టీచర్లు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ బస్తి 2 అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రసన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంటి బిడ్డల తల్లుల ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి బిడ్డకి తల్లిపాలు అందించాలని కోరారు.

తల్లిపాలలో రోగ నిరోధక శక్తి ఉంటుందని, మొదటగా ముర్రుపాలు పట్టించవలసిన ఆవశ్యకతను తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మావతి, స్వరూప, విజయలక్ష్మి, కనకతార, భారతి, రాజేశ్వరి, ఆయాలు సునీత, భాగ్యలక్ష్మి లతోపాటు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని టేకులబస్తీ 1 అంగన్వాడి కేంద్రంలో కూడా సోమవారం తల్లిపాల వారోత్సవాలను సూపర్వైజర్ పి. ప్రభావతి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు, చిన్నారుల తల్లులు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా సూపర్వైజర్ ప్రభావతి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తాగించాలని తల్లులకు సూచించారు. పుట్టిన చంటి బిడ్డలకు ఆరు నెలల పాటు తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలని చెప్పారు. చంటి బిడ్డల తల్లులు మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, అంగన్వాడి టీచర్లు కె అనురాధ, ఏ. పద్మ, బి ముత్యాలు, ఆయా కమల పాల్గొన్నారు.