12-08-2025 12:46:13 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): పదోతరగతి పరీక్షల్లో ఇరవై శాతం ఇంటర్నల్ మార్కులను ఎత్తేసి, 80శాతం ఎక్స్ టర్నల్ మార్కుల విధానాన్ని పక్కన పెట్టి.. మొత్తం 100 మార్కులకు ప్రశ్నాపత్రం రూ పొందించాలని రాష్ట్రప్రభుత్వం మొన్నటివరకు భావించింది. ఈమేరకు గతేడాది నవం బర్‌లో జీవోను సైతం జారీ చేసింది. కానీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) నిర్వ హించిన వర్క్‌షాప్‌లోనూ ఆ విధానంపై అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో సర్కార్ తన నిర్ణయంపై పునరాలోచించింది. చివరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నది. తాజాగా 20 శాతం ఇంటర్నల్ మార్కులు, 80శాతం ఎక్స్‌టర్నల్ మార్కుల విధానంలోనే పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కూడా అధికార ప్రకటన కూడా చేసింది.
ఈ విద్యా సంవత్సరంలో పాత పద్ధతిలోనే పది పరీక్షలు నిర్వహిస్తారనేది ఈ ప్రకటన సారాంశం. ఇదిలా ఉంటే సర్కార్ నిర్ణయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఇంటర్నల్ మార్కులను ఎత్తేశామని, మరోసారి కొనసాగిస్తున్నామని విద్యా ర్థులను ఆందోళనకు గురిచేయడం సరికాదని, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేట ప్పుడు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.