calender_icon.png 23 September, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటరాగేట్ చేసి వివరాలు రాబట్టండి

23-09-2025 01:26:57 AM

-ప్రభాకర్‌రావు విచారణకు సహకరించాల్సిందే

-సిట్‌కు సరోన్నత న్యాయస్థానం ఆదేశం

-ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి బెయిల్ రద్దుపై వాదనలు

-అక్టోబర్ కి విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయి ల్ రద్దుపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.ప్రభాకర్‌రావు దర్యాప్తునకు సహకరించడంలేదని, ఆయన మధ్యం తర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగగా.. తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం అక్టోబర్ 8కి వాయిదా వేసింది. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహత్, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదన లు వినిపించారు. ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరారు. ‘ప్రభాకర్‌రావు సిట్ దర్యాప్తునకు సహకరించడంలేదు. ఫోన్ డివైస్‌లలో డేటా ఫార్మాట్ చేశారు.

ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లోఉండగానే ఫోన్ డివైస్‌లో సమాచారం ధ్వంసం చేశారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక కూడా ఇచ్చింది. జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను కూడా ఆయన ట్యాప్ చేశారు. ప్రభుత్వ ఫోన్‌లో పాస్‌వర్డ్‌సైతం చెప్పడంలేదు. ఈ తరుణంలో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను తొలగించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రినాయు డు స్పందిస్తూ.. ఇప్పటికే తన క్లయింట్ చాలాసార్లు సిట్ విచారణకు హాజరయ్యాని..సహకరించడంలేదన్న దాంట్లో వాస్తవంలేదన్నారు.

అయితే ప్రభుత్వ ఆరోపణలపై స్పందించేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో.. ఈ కేసు తదుపరి విచారణను సుప్రింకోర్టు వచ్చే నెల ౮వ తేదీకి వాయిదా వేసింది.ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ దాకా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెబుతూ.. మధ్యంతర ఊరటను పొడిగించింది. అఆగే విచారణకు సహకరించా ల్సిందేనని ప్రభాకర్‌రావుకు కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో ఇంటరాగేట్ చేసి ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్‌కు సూచించింది.