02-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ఆగస్టు 1 (విజయక్రాంతి) : ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం బాలికల పాఠశాలను సందర్శించారు. బీఆర్‌ఎస్ మం డల ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు తన సొంత నిధులతో డొనేట్ చేసిన షూస్ లను పాఠశాలలోని 93 మంది పేద విద్యార్థులకు అందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ పాఠశా లలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి పెట్టాలని సమస్యల పరిష్కారానికి నేనున్నానని అన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సంధ్యారాణి, సునాల మాజీ సర్పంచ్ సదానందం, నాయకులు ప్రవీణ్ రఫీ తదితరులు ఉన్నారు.