02-08-2025 04:56:41 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): వాగేశ్వరీ మహిళా డిగ్రీ & పీజీ విద్యాసంస్థ(Vaageswari Degree & PG College)ల్లో ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మహిళా బ్లాక్(ఎ, బి వింగ్స్)లో హర్షోత్సాహాలతో వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, డాన్స్ షోలతో సందడి చేశారు. ఈ వేడుకలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డా. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... విద్యారంగంలో చదువులతో పాటు మంచి స్నేహబంధాలు కూడా అవసరం. ఇవి మన జీవితానికి వెలుగు కలిగిస్తాయి" అని పేర్కొన్నారు. తదుపరి మంచి స్నేహితుడి విలువ, స్నేహ బంధం ప్రాముఖ్యతపై అధ్యాపకులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు పరస్పరం ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు పెట్టుకొని తమ స్నేహాన్ని ప్రకటించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చెన్నోజు రమణ చారి, ఏ. ఓ వేదవ్యాస్,శ్యామ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.