02-08-2025 05:01:15 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన ఏర్పాట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) సమీక్షించారు. శనివారం స్థానిక నాయకులు పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూమన్న, వైస్ చైర్మన్ మజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం, అంకం రాజేందర్ తదితరులతో కలిసి మండలంలోని పర్యటన స్థలాలను పరిశీలించారు. రూట్ మ్యాప్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ లతో చర్చించారు.