calender_icon.png 19 November, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

19-11-2025 12:49:22 AM

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ, నవంబర్ 18: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కోదాడ శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. నడిగూడెం మండల కేంద్రంలో   గ్రామ పంచాయతీ నూతన భవనంను మంగళవారం ప్రారంభించారు. నడిగూడెంకు జిపి భవనం,సీసీ రోడ్లు నిర్మాణంతో పాటు నాలుగు అంగన్వాడి  కేంద్రాలకు భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని మరొక అంగన్వాడి సెంటర్‌ని మంజూరు చేస్తామని తెలిపారు.

గ్రామపంచాయతీ కార్యాలయమునకు  కావలసిన అవసరాలకు నిధులు కేటాయిస్తానని తెలిపారు.  మునగాల మండలంలోని కృష్ణానగర్ గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభించారు. మునగాల , మండలంలోని తాడువాయిలో, అనంతగిరి వాయిల్ సింగారం పల్లె దావఖానాను ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభించారు.

కార్యక్రమాల్లో  డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్,వేపూరు తిరుపతమ్మ సుధీర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణి పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బూత్కూరి వెంకటరెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, ఆర్డీవో సూర్యనారాయణ, పి ఆర్ డిఈ హర్ష పాల్గొన్నారు.