calender_icon.png 19 November, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమానికి సహకార సంఘాలు పాటుపడాలి

19-11-2025 12:50:01 AM

  1. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

రంగంపేటలో ఘనంగా సహకార వారోత్సవాలు

కొల్చారం, నవంబర్ 18 :రైతుల సంక్షే మం కోసమే సహకార సంఘాలు ఏర్పాటైనట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం రంగంపేట ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో సహకార సంఘం చైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేష్ అధ్యక్షతన జరిగిన సహకార వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారి నుండి రైతులను కాపాడడం కోసం రైతులకు వ్యవసాయ రంగంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో పెట్టుబడులకు సా యం అందించడం కోసమే సహకార సం ఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహకార సంఘంలో విత్తనాల విక్ర యం నుండి పండిన పంట విక్రయించే వర కు రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

గతంలో సహకార సంఘాలు కేవలం రుణ పంపిణీకి మాత్రమే పరిమితం అయ్యేవని, కానీ ప్రస్తుతం సహకార సంఘాలలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయం, పండిన పంట ను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి కొన్న ధాన్యాన్ని మిల్లులకు పంపడం లాంటి కార్యక్రమాలు నిర్వ హించడం ద్వారా సహకార సంఘాలు బలోపేతం అవుతున్నాయని తెలిపారు.

తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలను రైతులకు అందించే ఏకైక సంస్థ సహకార సంఘాలు అన్నారు. రంగంపేట సహకార సంఘంలో రూ.65 లక్షల అప్పులో ఉండగా ప్రస్తుత పాలకవర్గం అప్పులన్నీ రూ.20 లక్షలు నగదు నిలువ ఉంచడం గర్వించదగ్గ విషయమన్నారు. రంగంపేటలో షెడ్డు నిర్మాణం, ఎనగండ్ల సహకార సంఘం స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు.

చైర్మన్ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగి రమేష్ మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు రైతుల సహకారంతో గతంలో రూ.కోటి 20 లక్షల టర్నోవర్ ఉన్న సహకార సంఘాన్ని ఐదున్నర కోట్ల వరకు పెంచినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు మల్లేశం సీఈవో నవీన్ జిల్లా సహకార అధికారి కరుణాకర్ జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి సహకార సంఘం డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి,గంగులు పెంటయ్య, ఆకుల రమేష్, విశ్రాంత తహసిల్దార్ బాలకృష్ణారెడ్డి సంగాయపేట మంజీరా రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.