calender_icon.png 31 January, 2026 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేయాలి

04-10-2024 12:30:48 AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బీ వెంకటయ్య

నిర్మల్, అక్టోబర్ ౩ (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి వారి సంక్షేమానికి కృషిచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలపై శాఖలవారీగా సమీక్షించారు.

అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులు త్వరగా పరిష్కరించాలని కోరారు. నిర్మల్‌లో అంబేద్కర్ భవనం స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆయనను కలెక్టర్, ఎస్పీ సన్మానించారు.