31-01-2026 12:27:02 AM
ఆచూకీ నిర్ధారించిన పోలీసులు
బోధన్,జనవరి 30 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ఏ ఆర్ పి క్యాంప్ గ్రామ శివారులో గల ౄ46 కెనాల్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమయ్యింది. జిల్లాలో ఈఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టించింది. ఇటీవల ఈ సంఘటనకు సంబంధించిన సమాచారంతో కీలక మలుపు తిరిగింది. శుక్రవారం ఉదయం పోలీసులు బాలిక ఆచూకీని నిర్ధారించారు. మృత బాలిక మహారాష్ట్ర ముత్కేడ్ జిల్లా నివాసిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
బాలిక మృతి వెనుక గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బాలిక మృతదేహం తెలంగాణలోని కెనాల్లో లభించడం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రమాదవశులు జరిగిన సంఘటననా లేక బాలిక హత్య, హత్యకు గురై ఉంటుందా అనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తుసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నత పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. బాలిక ఇక్కడికి ఎలా చేరింది? ఎవరి ప్రమేయమైన ఉందా? అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరా లు వెల్ల డిస్తా మని పోలీసు లు తెలిపారు.