calender_icon.png 31 January, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మికి స్మార్ట్‌కార్డు!

31-01-2026 01:17:19 AM

  1. ఆధార్‌తో స్మార్ట్‌కార్డు అనుసంధానం
  2. ప్రతి మహిళకు ఇచ్చేలా చర్యలు
  3. ఆర్టీసీ, సీజీజీ సంయుక్త ఆధ్వర్యంలో రూపకల్పన
  4. చిప్ కార్డులో మహిళల పూర్తి వివరాలు నమోదు

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో మహిళల కోసం ప్రతి ష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకానికి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానున్నది. మహిళలకు ఆర్టీసీలో కల్పిస్తున్న ఉచిత ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డులు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నది. అసెం బ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథ కం ఒకటి.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు ఉన్నవారిని జీరో టికెట్ ఇస్తూ ఉచిత ప్రయా ణం కల్పిస్తున్నది. భవిష్యత్‌లో ఆధార్‌తో కాకుండా చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డు అందజేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. ఇందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), ఆర్టీసీ సంయుక్తంగా కార్డు రూప కల్పన చేస్తున్నట్టు సమాచారం. దీంతో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడివరకు ప్రయాణం చేశారు..

ఏ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నది అనే వివరాలను సైతం తెలుసుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా బస్సు సర్వీసులు కూడా నడుపనున్నట్టు తెలిసింది. టికెట్ మిషన్‌లో ఈ కార్డును పెడితే సంబంధిత మహిళ పేరుతోపాటు ఫొటో, గ్రామం, మండలం, జిల్లా, పిన్ కోడ్ వివరాలన్ని కనిపించనున్నాయి. దీని ఆధారంగా సంబంధిత కండక్టర్ టికెట్ ఇవ్వడం కూడా సులభం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

స్మార్ట్ కార్డుల తయారీకి రూ.100 కోట్ల నిధులు

తొలుత క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డు ఇవ్వాలని అధికారులు భావించారు. బస్సు ల్లో రాత్రి, సాయంత్రం వెళల్లో క్యూ ఆర్ కోడ్ సరిగ్గా పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుం దని.. కండక్టర్‌కు మహిళలకు మధ్య పంచాయితీ వచ్చే అవ కాశం ఉందని భావించి క్యూఆర్ కోడ్ స్థానంలో చిప్‌తోనే స్మార్ట్‌కార్డు ఇస్తే బాగుంటుందని నిర్ణ యానికి వచ్చినట్టు సమాచారం. ఈ కార్డుల తయారీ, పంపిణీ కోసం సుమారు రూ.100 కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేసిన ట్టు తెలిసింది. లబ్ధిదారుల గుర్తింపు కో సం ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ వివరాలను ప్రామాణికంగా తీసుకుంటారని సమాచారం.