calender_icon.png 31 January, 2026 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీ ఫామ్ ఉత్కంఠకు తెరపడేది ఎప్పుడో?

31-01-2026 12:14:27 AM

  1. నామినేషన్ వేసిన అభ్యర్థులకు తప్పని బీ ఫామ్ బెంగ 
  2. పార్టీలు కనికరించేది ఎవరికో... 
  3. అధికార పార్టీలో తీవ్ర పోటీ
  4. ప్రతిపక్ష పార్టీల్లో తప్పని హైరానా
  5. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి, పార్టీలలో అభ్యర్థులకు బీఫామ్ కోసం నెలకొన్న ఉత్కంఠ 
  6. బీ ఫామ్ వరించేది ఎవరికో...?
  7. బీ ఫామ్ వస్తే గెలిచినట్లే అనే ధీమా 
  8. బీ ఫామ్ కోసం హైరానా పడుతున్న అభ్యర్థులు
  9. ముగిసిన నామినేషన్ల పర్వం 
  10. మున్సిపల్ ఎన్నికలలో నామినేషన్ల ఘట్టం పూర్తి 

కామారెడ్డి, జనవరి 30 (విజయక్రాంతి): బి ఫామ్ కోసం నామినేషన్ వేసిన అభ్యర్థులకు బెంగ తప్పడం లేదు. కామారెడ్డి జిల్లాలో  కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీంగల్ మున్సిపల్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ లో అడుగు పెట్టాలంటే కౌన్సిలర్ గా గెలవాల్సిందే. మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఇన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ఆశవాహూలకు రిజర్వేషన్లు కొంతమందికి అనుకూలించక పోటీకి దూరం కాగా మరికొందరికి రిజర్వేషన్లు అనుకూలించ డంతో పోటీలో ఉండేందుకు నామినేషన్ల పర్వం ప్రభుత్వం ప్రకటించింది. 

జనవరి 28, 29, 30 తేదీల్లో నామినేషన్ వేసేందుకు ఎన్నికల సంఘం మూడు రోజులు గడువు ఇచ్చింది. మొదటి రోజు నామినేషన్లు తక్కువగా నమోదైన రెండవ రోజు, మూడో రోజు పోటీ చేసేందుకు ఆశావాలు పోటీపడి నామినేషన్లు దాఖలు చేశారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల కు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార పార్టీలో ముగ్గురు, నలుగురు పోటీల్లో ఉండేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ అధికార పార్టీలో పోటీ చేసేందుకు బీఫామ్ ఎవరికి విస్తే వారే పార్టీ సింబల్ తో పోటీ చేసే అవకాశం ఉంది.

దీంతో పోటీ చేస్తామని భావించిన ఆశావా హూలకు బి ఫామ్ బెంగ పట్టుకుంది. బి ఫామ్ తమ పేరుపై వచ్చేవరకు పోటీ చేయాలా వద్దా అనే డైలామా లో అభ్యర్థులు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అవకాశం వచ్చిన తాము పోటీ చేద్దాం అంటే అధికార పార్టీ నేతలు తమకు బి ఫామ్ కట్టబెడితేనే  పోటీ చేసేందుకు అవకాశం రావడంతో పాటు గెలుపు సునాయాసమవుతుందని అభ్యర్థులు కొందరు భావిస్తున్నారు. మరికొందరు బీఫామ్ పార్టీ నుంచి రాకపోతే ఇతర పార్టీల కు జంపు ఐ ఆ పార్టీ బీఫామ్తో పోటీలో ఉండేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు డ్రాప్ అవుదామని భావిస్తున్నారు.

కొందరు ఇండిపెండెంట్గా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆలోచనలో ఉన్నారు. తమ పేరుపై బీఫామ్ ఎప్పుడు వస్తుందో అనే బెంగ పట్టుకుంది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలో పోటీ చేసేందుకు ఆశావాహులు నామినేషన్లు మాత్రం వేశారు. ఆయా పార్టీల తరఫున పోటీ చేయాలనుకుంటే ఆ పార్టీల బీఫామ్ వచ్చిన వారికే ఆ పార్టీ సింబల్ పై పోటీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో బీఫామ్ కోసం ఆశావాహులైన అభ్యర్థులు హాయ్ రానా  పడుతున్నారు.

ముగిసిన నామినేషన్ల పర్వం 

కౌన్సిలర్ చైర్ పర్సన్ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్లు గత మూడు రోజులుగా గడువు ఉండడంతో ఆయా మున్సిపాలిటీలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం శుక్రవారం తో  ముగియడంతో  నామినేషన్లు వేసిన అభ్యర్థులు కు పార్టీ బీఫామ్ ఎప్పుడు ఆ పార్టీ నాయకులు తమ పేరుపై ప్రకటిస్తారు అనే బెంగ పట్టుకుంది.

బి ఫామ్ తమ పేరు పై ఇస్తేనే పోటీ చేస్తామని కొందరు భావిస్తుండగా మరికొందరు తమకు ఎన్నో సంవత్సరాలుగా కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని ఇప్పుడు బీఫామ్ ఇవ్వకుంటే ఎన్ని రోజులు పార్టీలో పనిచేసి తమకేమీ లాభం అంటూ కొందరు అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆపద కాలంలో పార్టీ కోసం పార్టీ పటిష్టత కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకొని పార్టీ జెండాలను మోయడంతో పాటు పార్టీ లు ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొనడంతో పాటు తమ అనుచరులను సైతం తీసుకువచ్చి సమావేశాల్లో కూర్చోబెట్టడం వంటి కార్యక్రమాలు చేసిన తమకు అసలు సమయంలో తమ పార్టీ చేతు ఇవ్వడం మింగుడు పడడం లేదని కొందరు ఇతర పార్టీల్లో బీఫామ్ ఇస్తమన డంతో ఆ పార్టీలో చేరడమే బెస్ట్ అంటూ కండువా మార్చుకుంటున్నారు.

బి ఫామ్ వచ్చేవరకు గ్యారెంటీ లేని కొందరు ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో రోజులుగా ఆశలు పెట్టుకున్న తమకు పార్టీ పెద్దలు అసలు సమయంలో బి ఫామ్ ఇవ్వకుండా చేతులెత్తేస్తే తాము ఇన్ని రోజులు ఖర్చులు పెట్టుకోవడంతో పాటు పార్టీ కోసం పని చేసి నా తమను గుర్తించకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

డబ్బులు ఉన్న అభ్యర్థులకే పోటీ..

మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీ కోసం పాటుపడిన తమకు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు పార్టీ తరఫున అవకాశం కల్పిస్తారని భావించిన కొందరి ఆశావాలకు పార్టీ పెద్దలు మొండి చేయి చూపుతున్నారు. దీంతో ఎన్ని రోజులుగా పోటీలో ఉండి కౌన్సిలర్‌గా ఎన్ని క అవుతామని ఆశలు పెట్టుకున్న ఆశావాహులు పార్టీ నేతలు అవలంబిస్తున్న పద్ధతు లతో హైరానా పడుతున్నారు. డబ్బులున్న వారికి ప్రాధాన్యం కల్పిస్తామని చెప్తుండడంతో పేద మధ్యతరగతి ఆశా వా హూలకు బీఫామ్ టికెట్ చుక్కేదిరవుతుంది.

పోటీ చేసేందుకు ఒక వార్డులో ఐదు లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెట్టుకునే వారికే పార్టీ టికెట్ ఇవ్వాలని పలు పార్టీల నేతలు భావిస్తున్నా రు. డబ్బులు చూపిన వారికి బీఫామ్ కట్టబెడతామని పోటీలో ఉంటే డబ్బులు ఖర్చు చేయడం తప్పదని అలాంటి వారికే వాటి అండదండలు ఉంటాయని ఆ పార్టీ ముఖ్య నేతలు చెప్తూ ఉండడంతో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన  అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు.

మరికొందరు తమ వార్డుల్లో ఓటరు తమకు అనుకూలంగా ఉన్నారని తామే గెలుస్తామని తమ పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇతర పార్టీల నుంచి బీఫామ్ తీసుకొని పోటీలో నిలబడతామని కొందరు ఆశావాహులైన నామినేషన్ వేసిన అభ్యర్థులు విజయ క్రాంతి ప్రతినిధితో తమ అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు. పార్టీకోసం పనిచేసిన తమకు పార్టీ పెద్దలు గుర్తించకుండా బీఫామ్ ఇవ్వడంలో కింద మీద చేస్తే ఇతర పార్టీలో కి వెళ్లి పోటీ చేస్తామని మరికొందరు అభ్యర్థులు తెలిపారు. ఏది ఏమైనా అన్ని పార్టీల్లో బీఫామ్ బెంగ అభ్యర్థులలో నెలకొంది. ఆయా పార్టీల నేతలు గెలుపు గుర్రాలకి బీఫామ్ కట్టబెడతామని చెప్తున్నారు. 

బీఫామ్ కోసం తంటాలు 

అధికార పార్టీ నుంచి ఒక్కో వార్డులో ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఫామ్ తమకు వచ్చేందుకు నాన తంటాలు పడుతున్నారు. పార్టీలో తమకు అవకాశం కల్పించాలని తమకు బి ఫాం కట్టబెట్టాలని సీనియర్ నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఒకవైపు పోటీలో ఉండడం మరోవైపు గెలుపు కోసం ప్రయత్నాలు చేయడం అభ్యర్థులకు కత్తి మీద సాములా మారింది. గెలుపు దేవుడెరుగు కానీ ప్రస్తుతం బీఫామ్ రావడమే పెద్ద కష్టమవుతుందని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బి పాములు ఇవ్వడం ఎంతవరకు పార్టీ నేతలకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసింది కానీ పార్టీల బి ఫామ్ బెంగ అభ్యర్థులకు పట్టుకుంది. పార్టీ పెద్దలు బీఫాంలో ఎవరికి కట్టబెడతారో అనే ఆందోళన కలుగుతుందని పలువురు అభ్యర్థులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. బి ఫామ్ చేతుల పడితేనే పోటీ చేయడం లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా కూడా రంగంలో ఉంటామని పలువురు అభ్యర్థులు నామినేషన్ కేంద్రాల వద్ద తమ ఆవేదనను వ్యక్తపరిచారు.