calender_icon.png 5 July, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయాలి

05-07-2025 12:29:29 AM

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి 

మహేశ్వరం,జూలై 4: బీఆర్ ఎస్ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని రామన్నగూడ వార్డు బీజేపీ అధ్యక్షుడు పెద్దోళ్ల విద్య సాగర్ తన అనుచరులతో కలిసి బీఆర్ ఎస్ లో చేరారు. మండల అధ్యక్షుడు పెద్దోళ్ళ ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మళ్లీ బీఆర్ ఎస్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. పాత కొత్త అందరూ కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాల కోసం పుట్టిన ఏకైక పార్టీ బిఆర్ ఎస్ అని, కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్,మాజీ ఉపసర్పంచ్ సుదర్శన్, వార్డ్ మెంబర్ మల్లేష్ , సీనియర్ నాయకులు నర్సింలు,శ్రీధర్‌పాల్గొన్నారు.