calender_icon.png 12 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దుకు కృషి

12-01-2026 12:05:04 AM

ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్, జనవరి ౧1 (విజయక్రాంతి): సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హతనుం డి మినహాయింపు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తానని నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం  పిఆర్‌టియు టీఎస్ నిర్మల్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కలిసి టెట్ పరీక్ష విధానం వల్ల ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంత రం నిర్మల్ శాసన సభ్యులు ఏలేటి మహేశ్వ రెడ్డి చేతుల మీదుగా పీఆర్‌టీయూటీఎస్ 2026 డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు తోట నరేంద్ర బాబు, వివి ధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా మండల బాధ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.