12-01-2026 12:06:37 AM
ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్
జైనూర్, జనవరి 11 (విజయక్రాంతి): ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ జెట్టి ఎలిజిబెత్ దంపతులు అని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు. ఆదివారం ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ - జెట్టి ఎలిజిబెత్ దంపతుల 39వ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్. పి. నితికా పంత్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, గిరిజన సంఘాల నాయకులతో కలిసి ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్- జెట్టి ఎలిజిబెత్, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జైనూర్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు విశ్వనాథ్, ఇరుకుల్ల మంగ, డిసిసి అధ్యక్షురాలు సుగుణ, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మార్లవాయి సర్పంచ్ కనక ప్రభావతి, రాజ్ గోండ్ సేవా సమితి ప్రతినిధి సిడాం అర్జు, రాయి సెంటర్ జిల్లా మేడి కుర్సింగ మోతిరామ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.