04-09-2025 12:00:00 AM
రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్
హుజురాబాద్,సెప్టెంబర్03:(విజయ క్రాంతి): ఆర్టీవో నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంప్ లోగల ఆర్టీవో కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు పుష్పగుచ్చం అందజేసి స్వా గతం పలికారు.
ఎంవిఐ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరంఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ డివిజన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి నూతన ఆర్టీవో భవన నిర్మాణం కొరకు రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని, వీలైనంత త్వరగా ల్యాండ్ అలొకేషన్ చేపించి భవన నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరు రాహుల్, అర్జున్, గౌత మ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డితోపాటు యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యాలయ సిబ్బందిపాల్గొన్నారు.