04-09-2025 12:00:00 AM
కాలనీల్లో రోడ్లపైనే నిర్మాణ సామగ్రి
ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు
సనత్‌నగర్, సెప్టెంబర్ ౩ (విజయక్రాంతి): ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా అధికారుల అండతో అక్రమార్కులు చెలరేగిపో తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొ క్కుతూ నగరంలో అక్రమ నిర్మాణాలు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నా యి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రజలు తరచూ ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరి ంచడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
సనత్‌నగర్‌లోని బీకే గూడా పార్క్ పరిసరాలు కాలనీ వాసులకి ఎప్పటినుంచో పచ్చదనం, సుఖశాంతుల నిలయం. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు ఆ ప్రశాంతతను భంగం కలిగిస్తున్నాయి. ఈ అక్రమాలకు అండగా నిలు స్తున్నది జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభా గం అవినీతి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీలోని ఒక భవనానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి లేకుండా మూడో అంతస్తు నిర్మాణం జరుగుతోంది.
గ్రీన్నెట్లతో కప్పి, ఇప్పటికే ఇటుక పనులు పూర్తి చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకా రం వారికి కేవలం గ్రౌండ్ + 2 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉం ది. కానీ వారు దానిపై అక్రమంగా మరిన్ని అం తస్తులు నిర్మిస్తున్నారు. భవనాల యజమానితో కలసి అధికారులు సర్దుబాటు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోడ్లపైనే ఇసుక, ఇటుక
సనత్నగర్‌లోని పలు కాలనీల్లో నిర్మాణదారులు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. రోడ్డుపైనే యథేచ్ఛగా ఇసుక, ఇటుకలు, సిమెంట్ సంచులు పోసేయడంతో వాహనదారలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల పాలవుతున్నారు. దుమ్ము రేగడంతో సమీపంలో ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అధికారుల మౌనం?
ఇంతజరుగుతున్నా అధికారులు ఎందు కు మౌనం పాటిస్తున్నారని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ, ఫీల్ సిబ్బంది కండ్ల ముందే పనులు సాగుతున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంతో మండిపడుతున్నారు.
ఫిర్యాదులు చేసినప్పుడే చర్య లు తీసుకుంటామని చెప్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మరుసటి రోజు నుంచి పనులు యథాలాపంగా నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచే స్తున్నారు. ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులు సైతం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నా రని ఆరోపణలు చేస్తున్నారు.
నిమజ్జన పనుల్లో బిజీగా ఉన్న
బీకే గూడా పార్క్ పరిసరాల్లో నిర్మాణాలకు వారు అనుమతి తీసుకున్నారు. అనుమతి పొందిన నిర్మా ణాలకంటే ఎక్కువ అంతస్తులు నిర్మి స్తే చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం గణేష్ నిమజ్జన శోభాయాత్ర పనులతో బిజీగా ఉన్నా.
మన్సూర్, టౌన్ ప్లానింగ్ అధికారి