19-11-2025 12:53:42 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నవంబర్ 18 (విజయ క్రాంతి): నకిరేకల్ మున్సిపాలిటీలో రూ.6 కోట్ల తో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు మంగళవారం పట్టణంలోని 6, 15, 16 వార్డుల పరిధిలో రూ. 1. 12 కోట్ల తో నిర్మించే సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థ సమస్యను పరి ష్కారం చేస్తానన్నారు. . గత పాలకులు నకిరేకల్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు.
వారి పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశా రు. ధ్వంసమైన రాష్ట్రాన్ని రెండేళ్ల పాలన లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. .
ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్,వైస్ చైర్మన్ మురారి శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ ఏ. రంజిత్ కుమార్, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, కౌన్సిలర్లు యసారపు లక్ష్మీ వెంకన్న, పన్నాల పావని శ్రీనివాసరెడ్డి, గాజుల సుకన్య, శ్రీనివాస్, ఘర్షకోటి సైదులు, మట్టిపల్లి కవిత వీరు, కందాల బిక్షం రెడ్డి, రాచకొండ సునీల్, గడ్డం స్వామి, బానోతు వెంకన్న, పోతుల సునీత రవి, చౌగోని రాములమ్మ సైదులు, చోగోని అఖిల లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గోలిపద్మ, సిగ శీను తదితరులు పాల్గొన్నారు.