calender_icon.png 19 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి సహకరిస్తా

19-11-2025 12:53:37 AM

  1. గజ్వేల్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లో రూ. 3 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ 

సెట్విన్ శిక్షణ కేంద్రంలో తంజాముల్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ 

ప్రారంభించిన ఇన్చార్జి మంత్రి వివేక్ 

సహజ ప్రసవాలను పెంచాలని మాతా శిశు ఆసుపత్రి డాక్టర్లకు సూచన

గజ్వేల్ నవంబర్ 18: సిద్దిపేట జిల్లాలో అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తానని, మరింత అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ని అడిగి అదనపు నిధులు తీసుకువస్తానని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు, గనుల, భూ గర్భ శాఖ మంత్రి జీ. వివేక్ వెంకట స్వామి అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో రూ.1. 5 కోట్లతో పత్తి మార్కెట్ ప్రహరీ గోడప్రహరీ గోడ, రూ.3 కోట్లతో సమీకృత మార్కెట్ లో దుకాణ సముదాయాల నిర్మాణాలకు శంకుస్థాపన ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గజ్వేల్ మార్కెట్ కమిటీకి ఆదాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో  దుకా ణ నిర్మాణాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశా రన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రజాపాలన ద్వారా ఆరు గ్యారంటీలు ప్రజలకు అందజేయడం కోసం ఎంతగానో కృషి చేస్తుంద న్నారు.

రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డులను అందజేసి, దేశంలో ఎక్కడ లేని విధంగా రూ. 12వేల కోట్లతో సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే రోల్ మె డల్ గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చాలా వేగంగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నందుకు కలెక్టర్, సిబ్బందిని అభినందించారు.

మలిదశలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నామని, నిజమైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామన్నారు. సన్న బియ్యం బోనస్ నిధులు అతి త్వరలో రైతుల అకౌంట్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. అందరి సహకారంతో జిల్లాలో మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డిని అదనపు నిధులను అడిగి మంజూరు చేయిస్తామన్నారు.

పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు దృష్టి సారించండి :- ఏంఎల్ సి యాదవ రెడ్డి 

గజ్వేల్ లో రెండు బస్టాండ్ పనులు చివరి దశలో ఉన్నాయని పూర్తి చెయ్యాలనీ, గజ్వేల్ రింగ్ రోడ్ భూ సేకరణతో కొంత నిర్మాణంలో జాప్యం జరిగిందని వాటికి సం బంధించిన భూ సేకరణ పూర్తి చేసి రింగ్ రోడ్డు పనులు పూర్తి చెయ్యాలని, ఆయా గ్రా మాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ లను పూర్తి చెయ్యాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి మంత్రి వివేక్ దృష్టికి వచ్చారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని సెట్విన్ శిక్షణ కేంద్రంలో తంజిముల్ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కుట్టు శిక్షణను మంత్రి ప్రారంభించారు.

 సాధారణ ప్రసవాలను పెంచాలి : మాతా శిశు ఆసుపత్రి వైద్యులకు మంత్రి వివేక్ సూచన 

ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను పెంచడంతోపాటు గర్భవతులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని మంత్రి వివేక్ వైద్యులకు సూచించారు. గజ్వేల్ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిని ఆయన సందర్శించి అక్కడ గర్భవతులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రసవాలలో సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పేషంట్లతో అన్యోన్యంగా డాక్టర్లు మెలగాలని తెలిపారు. ఆసుపత్రి వాతావరణం బాగుందని, మరింత మెరుగైన సేవలు అందించడానికి హాస్పిటల్ కు కావలసిన మౌలిక వసతులు, సౌకర్యాలు, వైద్య పరికరాలు అందిస్తామన్నారు. 

వైద్యం విషయం లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవ లు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, ఎంఎల్ సి యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుం ట నర్సారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ చంద్రకళ, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్,  కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అన్నపూర్ణ, తంజిముల్ మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మతిన్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.