12-08-2025 09:59:36 PM
మంచిర్యాల (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) ఆధ్వర్యంలో ఎస్ఆర్పి 3, ఆర్కే 5 గనిలో 2024-25 లాభాలను వెంటనే ప్రకటించాలని, కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని గని మేనేజర్ కి కార్మికుల సమక్షంలో మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే 5 ఫిట్ సెక్రటరీ చిగురు లక్ష్మణ్, ఎస్ ఆర్ పి 3 ఫిట్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు సాయిల్లా శ్రీనివాస్, మిడివెల్లి శ్రీనివాస్, బట్టు సురేందర్, బందు శ్రీనివాస్, ఇత్తినేని వెంకటేశ్, చీకట్ల సాగర్, విజయ్, రామ్ రెడ్డి, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.