12-08-2025 10:04:14 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): ప్రతి మహిళ సమ భావన సంఘ బంధం సంఘాల్లో సభ్యురాలుగా ఉండాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్(బ్యాంక్ లింకేజీ) బెనర్జీ(District Project Manager Banerjee) కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో మహిళా సమాఖ్య కార్యాలయంలో మంగళవారం మండల సమాఖ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 65 సంవత్సరాల పైబడిన వృద్ధ మహిళల సంఘంలో చేర్పించాలని, విభిన్న ప్రతిభావంతుల సంఘాలను ఏర్పాటు చేయడం, 15 నుంచి 18 సంవత్సరాలలోపు వారిని గుర్తించి కిషోర్ సంఘాలను ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాక సంఘం బయట ఉన్న మహిళలను గుర్తించి పాత సంఘాల్లో లేదా కొత్త సంఘాల్లో ఏర్పాటు చేయాలని కోరారు.
ఈనెల 31వ తేదీ వరకు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో వివో ఏలు ప్రతి ఇంటిని సర్వే చేసి పైన పేర్కొన్న నాలుగు కేటగిరీలో సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి సంఘాల్లో చేర్పించాలన్నారు. మహిళలు ఎవరు కూడా సంఘం బయట ఉండకూడదని తెలిపారు.బ్యాంకు లింకేజీ,స్త్రీ నిధి అర్హత ఉన్న సంఘాలకు లోన్ ఇప్పించడం,తిరిగి చెల్లింపులు చేయించడం జరుగుతుండాలని ఆయన సూచించారు.సమావేశంలో ఏపీ ఎం.డి అజయ్,మండల సమాఖ్య అధ్యక్షురాలు వీర కుమారి,కోశాధికారి రజియా బేగం,కార్యదర్శి గంగమ్మ,స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ జ్యోతి,సీసీలు చిన్న,సుజాత,సరిత,దుర్గ,కవిత తో పాటు అన్ని సంఘాల అధ్యక్షులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.