12-08-2025 09:58:22 PM
పటాన్ చెరు/జిన్నారం: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారంలో కమిషనర్ వెంకటరామయ్య(Commissioner Venkataramaiah) ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. వార్డు కార్యాలయం ఆవరణలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ తో కలిసి కమిషనర్ వెంకటరామయ్య ఇంటింటికి మామిడి, పనస మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రతి ఇంటి ఆవరణ మొక్కలతో కళకళలాడాలని ఆయన కోరారు. ఇంటి ఆవరణను పారిశుద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.