11-02-2025 12:00:00 AM
నల్లగొండ, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): గ్రీవెన్స్ ఫిర్యాదులు సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ భరోసా ఇచ్చారు. గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాల బారినపడిన 9 మందితో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం వివిధ సమస్యలపై వచ్చిన 45 మంది బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి కేసు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. భూ సమస్యలు, ఫైనాన్స్, భార్యాభర్తల వివాదాలపై ఫిర్యాదులు అధికంగా అందగా పరిశీలించి చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్‌కు గాని, https://www.cybercrime.gov.in లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు బాధితుల కోసం డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బాధితులు సెల్ నెంబరు 8712658079 ఫోన్ చేసి ఫిర్యాదులు అందించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.