calender_icon.png 7 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యసేవల బలోపేతానికి కృషి

07-11-2025 12:49:58 AM

  1. జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

17వ కామన్ రివ్యూ మిషన్ బృందం డీ-బ్రీఫింగ్ సమావేశం 

సంగారెడ్డి, నవంబర్ 6(విజయక్రాంతి):జిల్లాలో ఆరోగ్య సదుపాయాల నాణ్యత పెంపునకు అధికారులు, వైద్య సిబ్బంది మరింత శ్రద్ధ తీసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 17వ కామన్ రివ్యూ మిషన్ బృందం డీ-బ్రీఫింగ్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. సమీక్షలో జిల్లాలోని ప్రాంతీయ ఆసుపత్రి, మాతా, శిశు సంరక్షణ కేంద్రాలను సందర్శించి మానవ వనరులు, ల్యాబ్ సదుపాయాలు, ఫార్మసీ, డైట్, ఆసుపత్రిలో వస్తున్న ఇన్, అవుట్ పేషంట్ల పరిమాణం, పారిశు ద్ధ్యం,సేవలపై సమగ్ర సమీక్ష జరిపినట్లు తెలిపారు.

భారత ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 3 నుండి 5 వరకు సంగారెడ్డి జిల్లాలో బృందం పర్యటించిందన్నారు. పర్యటనలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు ఆరోగ్య సంస్థల్లో అందిస్తున్న సేవలు, మానవ వనరులు, ఔషధాల లభ్యత, మాతృ - శిశు ఆరోగ్య సేవల అమలు, ఆయుష్మాన్ భారత్, వెల్నెస్ సెం టర్ల ప్రగతి తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కామన్ రివ్యూ మిషన్ బృందం సమర్పించిన సూచనలను జిల్లాలో అమలుపచ్చి వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి నాగ నిర్మల, జిజిహెచ్ సూపరెంటెండెంట్ మురళీకృష్ణ, డిసిహెచ్‌ఓ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.