07-11-2025 12:52:02 AM
- రాష్ట్ర కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర పిలుపు
హనుమకొండ, నవంబర్ 6 (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ను ప్రభుత్వం చెల్లించలేకపోవడం వల్ల దానికి నిరసనగా ఈనెల 13న జయశంకర్ పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని శ్రీదర్ల ధర్మేంద్ర అన్నారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కమిటీకి కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ వివిధ జిల్లాలలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పోరాటాలు చేస్తుందని,అందులో భాగంగా ఈనెల 13 వ తేదీన వరంగల్ జిల్లా లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు.
అనంతరం ఈ నెల 4 న హైదారాబాద్ లో జరిగిన తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన అసోసియేషన్ రాష్ట్ర అడ్ హక్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని,అందులో వరంగల్ జిల్లా నుండి కో కన్వీనర్ నియమించబడిన ధర్మేంద్రకు అభినందనలు తెలియజేశారు.ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు.
కానీ అందుకు తమ ఉద్యోగ జీవితంలో దాచుకున్న జిపిఎఫ్, టిఎస్ జిఎల్‌ఐఎస్సి, ఆర్జిత సెలవులు,గ్రాట్యుటీ ఇవి ఉద్యోగుల హక్కు వీటి ద్వారా తమ పిల్లల పెళ్ళిళ్ళు చేసి ప్రశాంత జీవితం గడపాలని ఆశపడతారు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశలు అడియాశలు చేసినదని, ఆర్థిక ఇబ్బందులతో 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులు మానసిక క్షోభకు గురి అవుతున్నారని,దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది మనోవేదలతో మరణించారని, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కందుకూరి దేవదాసు,గఫార్, మేకిరీ దామోదర్,ఇంద్రిసేనారెడ్డి, సభ్యులు బత్తిని సారయ్య,అశోక్ కుమార్,వెంకటయ్య రవీందర్,సంజీవరెడ్డి,శ్యాంసుందర్,సాంబయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.