25-07-2025 12:05:49 AM
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు
గద్వాల టౌన్, జూలై 24 : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు,రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు అగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్లు సరఫరా చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు తెలిపారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు కో డి గుడ్ల కొనుగోలుకు జిల్లా స్థాయి టెండర్ ఫ్రీ-బిడ్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్ వంటి సంస్థలకు (మధ్యాహ్న భోజన పథకం మినహా) ఒక సంవత్సరం పాటు గుడ్ల సరఫరా కోసం టెండర్ ప్రక్రియ నిర్వహించబడుతుందని తెలిపారు.2025-26 విద్యా సంవత్సరంలో అవసరమయ్యే 1 కోట్ల 34లక్షల 16వేల 862 గుడ్లను సరఫరా చేసేందుకు ఆన్లైన్ ద్వారా టెండర్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 22 నుండి 30 తేదీ సాయంత్రం 5 గంటల వరకు బిడ్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకుని అంతర్జాలంలో బిడ్లను సమర్పించాలన్నారు.సమర్పించిన బిడ్ల హార్డ్ కాపీలను జూలై 30 తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఐడీఓసీ, హాల్ ఎఫ్-8ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
జూలై 31 మధ్యాహ్నం 3:000 గంటలకు టెక్నికల్ బిడ్లను తెరవడం జరుగుతుందని, ఆగస్టు 1 ఉదయం 11:00 గంటలకు ధరల బిడ్ తెరవడం జరుగుతుందని తెలిపారు. టెండర్ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని దరఖాస్తులు http://tender. telangana.gov.in ద్వారా డిజిటల్ సంతకంతో సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత,డీడబ్ల్యూఓ సునంద విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.