calender_icon.png 27 July, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం

26-07-2025 07:09:38 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. శనివారం కడెం ప్రాజెక్టు వద్ద నిర్వహించిన మాక్‌డ్రిల్‌ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ ప్రత్యేక అధికారి హరికిరణ్, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం చేపట్టిన రక్షణ విన్యాసాలను పరిశీలించిన అనంతరం వారు, అనంతరం బోటులో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

భయపడాల్సిన అవసరం లేదని విపత్కర పరిస్థితుల్లో స్పందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందని కలెక్టర్ వివరించారు. ప్రాజెక్టు గేట్లు, నీటి మట్టం, ఇన్‌ఫ్లో తదితర అంశాలపై అధికారులను అడిగి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అధిక వరద ప్రవాహానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ అమర్ ప్రతాప్ సింగ్, ఎక్సైజ్ అధికారి ఎం.ఎ. రజాక్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.