calender_icon.png 22 May, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరూ ఈ నంబాల కేశవరావు..?

21-05-2025 05:45:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్(Encounter) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నారాయణపూర్-బీజాపూర్ మధ్య ఇంద్రావతి అభయారణ్యం(Indravati Sanctuary)లో భద్రతా బలగాలు రెండ్రోజులుగా కూంబింగ్ ఆపరేషన్(Combing Operation) నిర్వహించారు. కూంబింగ్ లో భాగంగా నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) అలియాస్ బసవరాజు(Basavaraj) సహా 27 మంది మరణించారు. అతనిపై రూ.కోటిన్నర రివార్డ్ ఉందని పోలీసులు వెల్లడించారు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు, కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. కేశవరావు విద్యాభసం మొత్తం తాతగారి ఊరైన టెక్కలి మండలంలోనే హైస్కూల్ విద్యను పూర్తి చేసి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగానే వరంగల్ లో బీటెక్ సీట్ రావడంతో అక్కడికి వెళ్లి కాకతీయ రీజినల్ ఇంజనీర్ కళాశాలలో బీటెక్ జాయిన్ అయ్యాడు.

అక్కడి నుంచి రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేసి 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యారు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ మాజీ సైనికుల వద్ద శిక్షణ పొందిన కేశవరావు గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడయ్యారు. 2019లో గడ్చిరౌలిలో 15 మంది పోలీసుల మృతి ఘటనకు నంబాళ్ల కేశవరావు సూత్రధారి ఉన్నారు. 2018 నవంబర్ లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేయడంతో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2010 ఏప్రిల్ లో  ఛత్తీస్‌గఢ్ లోని చింతల్నార్ ఘటనలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందెందుకు వ్యూహం కేశవరావుదే. తూర్పు గోదావరి, విశాఖపట్నంలో మావోయిస్టు పార్టీలో పని చేసిన నంబాళల కేశవరావు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా పనిచేశారు. 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మపై దాడి వెనుక ఇతని హస్తమే ఉంది.మహేంద్రకర్మతోపాటు మరో 27 మంది మరణించారు.