21-05-2025 05:39:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్(District Revenue Additional Collector Kishore Kumar) అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారి ధాన్యం జొన్నల కొనుగోలు కేంద్రాలపై ఆరా తీశారు. వాతావరణ పరిస్థితులు మారడం వల్ల వర్షాలు పడే అవకాశం ఉందని రైతులు పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
నిబంధన ప్రకారం ఉన్న ధాన్యమును వెంటనే కొనుగోలు చేయాలని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లారీల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే రైతులు అధికారులను సంప్రదించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసినందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.