31-10-2025 10:00:34 PM
 
							భారత్ గ్యాస్ సబ్సిడీ పొందాలంటే ప్రతి సంవత్సరం ఈ కేవైసీ తప్పనిసరి
గరిడేపల్లి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యాస్ సబ్సిడీ పొందాలంటే ప్రతి వినియోగదారుడు ఈ కేవైసీ ప్రతి సంవత్సరం చేయించుకోవాలని భారత్ గ్యాస్ మేనేజర్ బండ పుల్లారెడ్డి కోరారు. ఆయన గరిడేపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... గ్యాస్ వినియోగదారులు తమ కంపెనీకి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ కార్యానికి వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలని,లేని పక్షంలో గ్యాస్ స్రఫరా చేసే డెలివరీ బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ సేవలు ఉచితంగా పొందవచ్చని తెలిపారు.
గరిడేపల్లి మండలంలోని భారత్ గ్యాస్ వినియోగదారులంతా మండల కేంద్రమైన గరిడేపల్లి లో ఉన్న భారత్ గ్యాస్ కార్యాలయానికి వచ్చి వినియోగదారులు ప్రతి ఏడాది ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయన కోరారు.ఈ కేవైసీ చేయించుకున్న వినియోగదారులకు మాత్రమే గ్యాస్ సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఏడాదికి వినియోగదారులకు 9 సిలిండర్లు పంపిణీ చేస్తూ వాటికి కేంద్రం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ఈ కేవైసీ చేయించుకోకుంటే 8వ, తొమ్మిదవ సిలిండర్ కు సబ్సిడీ వర్తించదని తెలిపారు.
మార్చి 31వ తేదీ లోపు ఈ కేవైసీ చేయించుకుంటే కేంద్రం తిరిగి నిలిపివేసిన సబ్సిడీని చెల్లిస్తారని తెలిపారు. లేనిపక్షంలో వినియోగదారులకు సబ్సిడీ శాశ్వతంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తారు.కానీ సబ్సిడీ మాత్రం రాదని ఆయన వివరించారు. వినియోగదారులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయన కోరారు. వినియోగదారులు వివరాల కోసం గరిడేపల్లిలోని భారత్ గ్యాస్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.