31-10-2025 10:04:16 PM
 
							బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు శుక్రవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం లోని పోతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని మండలాలకు చెందిన 57 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల బిల్లులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
వర్ని మండలం పాత వర్ని, జలాల్ పూర్, జకోరా, SN పురం గ్రామాలకు చెందిన 24 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 82,41,056/- ,పోతంగల్ సుంకిని గ్రామానికి చెందిన 20 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 56,44,800/- , కోటగిరి మండలం ఎక్లాస్పూర్ క్యాంప్ గ్రామానికి చెందిన 05 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 16,12,800/- ,రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన 8 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 24,18,474/- , మొత్తం 57 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 1,79,17,130/-పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.