calender_icon.png 22 August, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనీట్రాప్‌లో వృద్ధుడు రూ.7 లక్షలు స్వాహా

22-08-2025 02:31:31 AM

  1. మహిళ పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయం 
  2. మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 21 (విజయ క్రాంతి): హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటకు చెందిన ఓ వృద్ధుడు సైబర్ నేరగాళ్లకు చిక్కుకొని భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. మహిళ పేరుతో పరిచయమైన కేటుగాళ్లు, మాయమాటలతో నమ్మించి ఆయన నుంచి ఏకంగా రూ.7.11 లక్షలు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్ర హించిన బాధితుడు, నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే..

అమీర్‌పేటకు చెందిన 65 ఏళ్ల వ్యక్తికి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ మహి ళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దానిని అంగీకరించిన తర్వాత, అవతలి వైపు నుంచి మహిళ తీయగా మాట్లాడుతూ పరిచయం పెంచుకుంది. తనను తాను విదేశాల్లో ఉంటున్నట్లు, ఒంటరిగా జీవిస్తున్నట్లు చెప్పి ఆయన సానుభూతి పొందింది. కొద్ది రోజు ల సంభాషణల తర్వాత, తనకు విలువైన బహుమతులు పంపిస్తున్నానని, అవి ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల వద్ద చిక్కుకున్నాయని నమ్మబలికింది. వాటిని క్లియర్ చేయడానికి డబ్బు అవసరమంటూ విడతలవారీగా వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బు పంపమని కోరింది.

ఆమె మాటలు గుడ్డిగా నమ్మిన బాధితుడు, పలు దఫాలుగా మొ త్తం రూ. 7.11 లక్షలను ఆమె చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. డబ్బు పంపిన తర్వాత కూడా ఇంకా కావాలని డిమాండ్ చేయడం తో  వృద్ధుడికి అనుమానం వచ్చింది. తాను హనీట్రాప్‌లో చిక్కుకుని మోసపోయానని గ్రహించి, వెంటనే నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులు ఉపయోగించిన ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.