22-08-2025 02:31:27 AM
శేరిలింగంపల్లి, ఆగస్ట్ 21: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుం బానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే ఆత్మ హత్య గా పోలీసులు భావిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నా యి. మియాపూర్‌లోని ముక్తలో నివాసం ఉంటు న్న కుటుంబ సభ్యులంతా అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం స్థాని కుల ద్వారా పోలీసులకు సమాచారం అం దించడంతో గురువారం విషయం వెలుగు చూసిం ది.
మృతులంతా కర్ణాటక గుల్బర్గాకు చెందిన లక్ష్మయ్య(60), భార్య వెంకటమ్మ (55), అల్లుడు అనిల్(40), కూతురు కవిత (38), మనవరాలు అప్పు(2) వారిగా గుర్తించారు. ఘట నా స్థలానికి స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల శవాల పక్కన వాంతు లు కనిపించడంతో విషం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య నా, మరి ఇంకా ఏమైనా కారణం ఉందా అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా చిన్నారిని హత్య చేసి ఆ తర్వాత మిగతా వారు విషం తీసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యలకు ఆర్థిక సమస్య లు, కుటుంబ కలహాలే కారణమై ఉంటాయన్నది పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నా రు. లక్ష్మయ్య, వెంకటమ్మలు స్థానికంగా మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి బిడ్డే అల్లుడు అజీజ్ నగర్ లో నివాసము ఉం టూ స్థానికంగా కూలీ పను లు చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్నారు.
అల్లుడు బిడ్డే అజీజ్ నగర్ నుంచి అత్తమామల వద్దకే ఇల్లు మారేందుకు వచ్చినట్లు స్థా నికులు తెలిపారు. వీరికి గ్రామంలో అప్పులు కారణంగానే హైదరాబాదుకు బతుకుదెరు వు కోసం వలస వచ్చినట్లు స్థానికులు చెప్పా రు. రాత్రి వారు తిన్న ఆహారానికి సంబంధించిన శాంపిళ్లను పోలీసులు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టుకు పంపించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతికి సంబంధించి పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉంది.