22-08-2025 02:29:37 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 21 (విజయక్రాంతి): నగర మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీ లక ప్రాజెక్టులకు, సుమారు వెయ్యి కోట్లకు పైగా విలువైన పనులకు ఆమోదముద్ర వే సింది.
మొత్తం 39 ప్రతిపాదనలను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. నగరంలో ఎల్ ఈడీ వీధిదీపాలు, సీసీఎంఎస్ ప్యానెళ్ల నిర్వహణ, స్థాపన కోసం రూ. 897 కోట్లతో టెం డర్లకు ఆమోదం తెలిపింది.
కొత్త సిగ్నళ్ల ఏర్పాటుకు టెండర్లు
నగరంలోని 404 ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహ ణ, కొత్త సిగ్నళ్ల ఏర్పాటు కోసం రూ. 72.31 కోట్లతో టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెట్ల కొమ్మల తొలగింపునకు అదనంగా 10 వెహికల్ మౌంటెడ్ బకెట్ నిచ్చెనలను ఏడాది పా టు వినియోగించేందుకు రూ. 4.07 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిం ది. నగరంలోని షేక్ ఫైజ్ కమాన్ నుంచి దబీర్‌పుర ఫ్లైఓవర్ వరకు రోడ్డు, ఫుట్‌పాత్ ని ర్మాణం (రూ.5.70 కోట్లు).
కాప్రా, సాయి బాబా నగర్ స్మశానవాటికల అభివృద్ధి (రూ.5 కోట్లు), రెయిన్‌బో విస్టాస్ నుంచి ఖైతలాపూర్ వరకు రోడ్డు విస్తరణ, డ్రైన్ ని ర్మాణానికి (రూ.4.50 కోట్లు) ఆమోదం తెలి పింది. టోలిచౌకి ఫ్లైఓవర్ కింద నిర్మించిన 18 కొత్త వెండింగ్ షాపులను బహిరంగ వే లం ద్వారా కేటాయించడం, గడువు ముగిసి న షాపులకు అద్దె పెంచడం వంటి ఆదాయ మార్గాలపై కమిటీ ఆమోదం తెలిపింది. మో డల్ మార్కెట్లలోని 354 ఖాళీ షాపులను బ హిరంగ వేలం వేయడానికి నిర్ణయించారు. మల్కం చెరువులో బోటింగ్, నీటి క్రీడల ని ర్వహణకు హైదరాబాద్ బోటింగ్ క్లబ్‌కు అ నుమతి ఇచ్చారు.
పరిపాలన నిర్ణయాలు
పరిపాలనకు సంబంధించి 33 మంది అసిస్టెంట్ ఎంటమాల జిస్టులను ఔట్ సో ర్సింగ్ ద్వారా నియమించుకోవడానికి, హై డ్రా నుంచి బదిలీపై వచ్చిన 67 మంది డ్రైవ ర్లు, 223 మంది సెక్యూరిటీ గార్డుల సేవలను వినియోగించుకోవడానికి ఆమోదం తెలిపా రు. రోస్టర్ ప్రకారం అర్హులైన 96 మంది సీ నియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పించే ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది.
సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, స్టాండింగ్ క మిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు, జోన ల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పా ల్గొన్నారు. తొలుత రామాంతపూర్‌లో శ్రీకృ ష్ణ జన్మాష్టమి శోభాయాత్రలో విద్యుదాఘాతంతో మృతిచెందిన ఐదుగురు యువకుల కు సమావేశం నివాళులర్పించింది.