calender_icon.png 22 August, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నల అరిగోస

22-08-2025 01:32:37 AM

  1. యూరియా కోసం కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన 
  2. గంటల తరబడి క్యూలైన్‌లలో.. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో తోపులాట 
  3. సొమ్మసిల్లిపడటంతో రైతుకు తీవ్రగాయాలు

విజయక్రాంతి నెట్‌వర్క్: యూరియా కొరతతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రైతుల పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. వరి నాట్లు వేసి రోజులు గడుస్తున్నా, నేటికీ సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకలంతా తీరిన వ్యక్తికి అన్నం పెట్టినట్టు.. పంట కు సరైన సమయంలో ఎరువులు అందించకుండా.. ప్రభుత్వాలు తాత్సారం చేయడం వల్ల నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరినాట్లు వేసిన 20 రోజుల్లోనే పంట ఎదుగుదలకు యూరియా అందించాల్సి ఉంటుందని, కానీ నెల రోజులు దాటి నా ఇప్పటికీ సరిపడా యూరియాను పంటకు అందించలేకపోతున్నామన్నారు. సకాలంలో సరిపడా ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆగ్రో సేవా కేంద్రంలో గురువారం యూ రియా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు, ఒక్కసారిగా పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

దీంతో అక్కడ తోపులాట జరిగింది. చిల్లంచర్ల గ్రామపరిధి మల్లమ్మకుంటకు చెందిన అజ్మీర లక్క, తన భార్యతో కలిసి వచ్చాడు. క్యూలైన్‌లో నిలబడి సొమ్మసిల్లి పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిం చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సతీష్‌కుమార్ గౌడ్, అగ్రికల్చర్ ఆఫీసర్ వీరాసింగ్ ఘటనా స్థలికి చేరుకొని, రైతులు క్యూలైన్‌లో నిల్చొనేలా చర్యలు చేపట్టా రు.

ఒక్కొక్కరికి బస్తా చొప్పున వంద బస్తాల యూరియా పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు ఆ గచాట్లు పడ్డారు. ఇచ్చోడలో తెల్లవారకముం దే ఎరువుల పంపిణీ కేంద్రం ముందు బారు లు తీరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యా ప్తంగా యూరియా కొరత వేధిస్తోంది. పనులన్నీంటిని విడిచి యూరియా కోసమే వేచి చూడాల్సివస్తోందని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేట, నర్సాపూర్‌లో రైతులు కదం తొ క్కారు.

వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదరాలపై ధర్నాకు దిగారు. వీరి ధర్నాకు స్థానిక బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్నదాతలకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘో రంగా విఫలమైందని స్థానిక బీజేపీ కౌన్సిలర్ రాగి రాములు ఆరోపించారు. చిలప్‌చేడ్ మండలం చండూర్ చౌరస్తా వద్ద మెదక్ సంగారెడ్డి రహదారిపై రైతులతో కలిసి నర్సా పూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధర్నా చేశారు.

యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠా యించి నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చిం దన్నారు. రామాయంపేట పీఏసీఎస్ వద్ద ఐదారు రోజులుగా యూరియా కోసం రైతు లు పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ సైతం బీజేపీ ఆధ్వర్యంలో గంట పాటు నిరసన వ్య క్తం చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండ లం రాఘవాపూర్‌లో యూరియా విక్రయ కేంద్రం వద్దకు భారీగా చేరుకున్న రైతులకు ఎరువులు లభించకపోవడంతో సిద్దిపేట, ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.

విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నేతలు అక్కడికి చేరుకొని అన్నదాతల ఆందోళనకు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ హ యాంలో ఎన్నడూ యూరి యా కొరత తలెత్తలేదని గుర్తుచేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళనను విరమించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక చో ట్ల రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ, కురవి, గుండ్రాతిమడుగు తదితర ప్రాంతాల్లో వందలాది మంది రైతులు యూరియా కోసం బా రులు తీరారు. యూరియా లారీ ఇలా వ చ్చిందో లేదో.. అలా వందల మంది రైతులు యూరియా కోసం పోలోమంటూ పరిగెత్తుకొచ్చారు. ఉన్న కొద్దిపాటి యూరియాను పంపిణీ చేయడానికి  పోలీసు,  వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులకు తలనొప్పిగా మారింది.

మహబూబాబాద్ జిల్లావ్యాప్తం గా అనేకచోట్ల రైతులు యూరియా కోసం తోపులాడుకున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, ఇతర ఉన్నత అధికారులు ఎరువుల షాపులను తనిఖీ చేశారు. జిల్లాలో 9 ఎరువుల షాపుల లైసెన్సులను తాత్కాలికం గా సస్పెండ్ చేశారు.

ఎరువుల పంపిణీలో ప్రభుత్వం విఫలం:  రెడ్యా నాయక్

ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, యూరియా పంపిణీ ఇబ్బందులే ఎందుకు నిదర్శనమని డోర్నకల్ మా జీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆరోపించారు. కురవి మండల కేంద్రంలో ఆయన యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతుల వద్దకు వచ్చి వారితో కలిసి కొంతసేపు ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతి నిధులు రైతులకు యూరియా ఇప్పించలేకపోతున్నారని విమర్శించారు. రైతులు యూ రియా కోసం ఇబ్బందులు పడుతుంటే ప్ర జాప్రతినిధులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ర్ట ప్రభుత్వానికి వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదని, సాగుకు అవసరమైన ముందస్తు ప్రణాళిక లేదని, దీనితో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురైందని ఆయన ఆరోపించారు. 

హమాలీగా మారిన ఆర్‌ఐ! 

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో సొసైటీ వద్దకు ఎరువుల లారీ వచ్చింది. లారీ నుంచి యూరియా బస్తాలు దించేందుకు కొంతమంది హమాలీ కార్మికులు ఉండటంతో, యూరియా పంపిణీ పర్యవేక్షణ కోసం వచ్చిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కొద్దిసేపు హమాలీ అవతారం ఎత్తారు. లారీ నుంచి గోదాం వరకు ఎరువుల బస్తాలను మోసి హమాలీలకు సాయంగా నిలిచాడు.

* ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేటీఆర్ మద్దతు మాకొద్దు. ఆయనను సపోర్టు అడగలేదు. యూరియా దుర్వినియోగం కాకుండా రాష్ర్ట ప్రభుత్వం చూడాలి. తెలంగాణ మంత్రులు రోజూ యూరియా లేదని మాట్లాడటంతో దొరికిన చోట కొందరు దీన్ని స్టోర్ చేసుకున్నారు. దీనితోనే సమస్య ఉత్పన్నమైంది.

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

* జీవితంలో యూరియా చూడనివారు కూడా మాపై విమర్శలు చేస్తు న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పలుకుబడి ఉంటే రాష్ట్రానికి యూరియా వాటా తెప్పించాలి. చచ్చిన పార్టీని బతికించాలని బీఆర్‌ఎస్ నేతలనుకుంటున్నారు. మీరు రేపు ఓట్లు ఎవరికి వేస్తారో మాకు తెలుసు.

 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు