22-08-2025 02:29:28 AM
ముషీరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉం టుందని అలాంటి చరిత్రను లిఖించి పుస్తక రూపంలోకి తెచ్చి భావితరాలకు అందించాలని అందుకు బాలలు సాహిత్య అభిరుచి పెంపొందించుకుని రచనలు చేయాలని దక్కన్ ల్యాండ్ సంపాదకులు మణికొండ వేదకుమార్ అన్నారు.
గురువారం సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలోని అనంత సాగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వ్రాసిన ’అనంత సాగర్ అక్షర కెరటాలు’ అనే బాలల కథల పుస్తకాన్ని బాల చెలిమి, దక్కన్ ల్యాండ్ సంపాదకులు మణికొండ వేదకుమార్ ఆవిష్కరించినట్లు బాలచెలిమి కో-ఆర్డినేటర్ ఖైజర్ బాషా నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేద కుమార్ మాట్లాడుతూ బాలల రచనలు ముద్రించడానికి చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అకాడమీ సహాయం చేస్తుందన్నారు.
ఉపాధ్యాయులు బాల సాహిత్యాన్ని ప్రోత్సహిం చాల ని, రేపటి సమాజానికి ఉత్తమ పౌరులను అందించేది సాహిత్యమేనన్నారు. విద్యార్థులు ఎక్కువగా పుస్తకాలు చదవాలని, గ్రం థాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యా లయ తెలుగు ఆచార్యులు డాక్టర్ రఘు ఏడవ తరగతి విద్యార్థి బి. విశ్వతేజ వ్రాసిన ’విశ్వతేజం’ కథల పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థులు చిన్న వయసులోనే కథలు వ్రాయడం అద్భుతమన్నారు.
ప్రధానోపాధ్యాయురాలు కోట జ్యోతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భైతి దుర్గయ్య సంపాద కత్వంలో రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ అనంతరం పాఠశాలలో బాల చెలిమి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పాఠశాలకు వందకు పైగా పుస్తకాలు బహుకరిం చారు. ఈ కార్యక్రమంలో బాల సాహితీ వేత్త గరిపెల్లి అశోక్, కథల తాతయ్య రాజమౌళి, తోట మధుసూదన్, గ్రామస్తులు ధర్మయ్య, కిష్టారెడ్డి, బాబయ్య, ఉపాధ్యాయులు శ్రీదేవి, సమ్మయ్య, నరేష్, దుర్గయ్య, పర్షరాములు తదితరులు పాల్గొన్నారు.