calender_icon.png 25 July, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడి బ్యాంకు ఖాతా ఖాళీ

24-07-2025 01:15:39 AM

రూ.36లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని దోమల గూడలో సైబర్ నేరగాళ్లు మరోసారి విజృంభించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో 79 ఏళ్ల వృద్ధుడిని నమ్మించి, రూ.35.74 లక్షలు కాజేశారు. దోమలగూడకు చెందిన 79 ఏళ్ల వృద్ధుడికి కొందరు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము సీబీఐ అధికారులమని, వృద్ధుడు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని బెదిరించారు.

ఆ తర్వాత ఒక వీడి యో కాల్ చేసి, పోలీసు యూనిఫామ్‌లో ఉన్న కొంద రు వ్యక్తులను చూపించారు. తాము ముం బయి కోలబా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికారు. దీంతో భ యాందోళనకు గురైన వృద్ధుడు, సైబర్ నేరగాళ్లు చెప్పినట్లుగా వారి ఖాతాకు రూ.35.74 లక్షలు బదిలీ చేశాడు. నగదు బదిలీ చేసిన తర్వాత స్థానిక క్రైమ్ బ్రాంచికి వచ్చి డబ్బు తీసుకోవాలని చెప్పి నేరగాళ్లు ఫోన్ కట్ చేశారు.

ఆ తర్వాత వారు స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు, సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు ప్రారంభించారు. ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసు లు సూచించారు.