calender_icon.png 25 July, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ధ

24-07-2025 01:14:09 AM

  1. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం
  2. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి పొన్నం 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): జీహెఎంసీ కార్మికులు, సిబ్బం ది ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందిన, ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

జూబ్లిహిల్స్ నియోజక వర్గంలోని కృష్ణకాంత్ పార్క్‌లో బుధవారం జీహెఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి ఆరోగ్య పరీక్ష లు చేయించుకుని, కార్మికులకు హెల్త్ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రులకు వెళ్లకుండానే అవసరమైన పరీక్షలు, మందులు అందించేలా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని చె ప్పారు. రెవెన్యూ, మున్సిపల్, వైద్య సిబ్బంది కలిసి ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 169 బస్తీ దవాఖానలు, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 11 స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

30 ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జీహెఎంసీ కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది, పొదుపు సంఘాల సభ్యులు ఉచిత పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని అవసరమైన మందులు పొందాలని సూచించారు.  మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. జీహెఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని,

గ్రేటర్ హైదరాబాద్‌లోని 30 సర్కిళ్లలో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఫ్రంట్‌లైన్‌లో ఉంటూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేది కార్మికులేనని, వారికి అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కు వ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు అజారుద్దీన్, నవీన్ యాదవ్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.