calender_icon.png 8 July, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజులకు సముచిత స్థానం కల్పించాలి

08-07-2025 12:37:40 AM

ఖైరతాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం ముదిరాజ్ కులస్తులకు సముచిత స్థానం కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణ రాష్ర్ట ముదిరాజుల పోరాటా సమితి విజ్ఞప్తి చేసింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి కి , కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమితి నేతలు సుంకరబోయిన మహేశ్ , అశోక్ ముదిరాజ్. పులి దేవేందర్, రంజిత్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. ముదిరాజ్ ల ను బిసిఏ నుంచి బిసి గ్రూపులోకి మార్చిన తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పదవులలో మండల, జిల్లా ఆధ్యక్షుల ఎంపికలో ముదిరాజ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

వచ్చే ఏడాది ఖాళీ కాబోతున్న ఎంఎల్ సి స్థానం భర్తీకి ముదిరాజ్ ఆత్మగౌరవ ప్రతీక అయిన నీలం మధు ముదిరాజ్ కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బందూక్, ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతిని రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, మహబూబ్ నగర్ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ర్టవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సమితి నేతలు రవి, శేఖర్, చందు తది తరులు పాల్గొన్నారు.