calender_icon.png 8 July, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల వైద్య సేవలకు సహకారం

08-07-2025 12:38:51 AM

వారసిగూడ జూలై 7 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ సోమవారం 31 మంది లబ్దిదారులకు సుమారు. రూ.10 లక్షల విలువ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను, ఇద్దరు రోగుల వైద్య ఖర్చులకై రూ.3.5 లక్షల విలువజేసే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సీ) పత్రాలను సీతాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు వైద్య%ళి%  నాణ్యమైన భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సీతాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని, తమ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచమని తెలిపారు. కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, రాసురి సునీత, సమన్వయకర్త రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు.