12-12-2025 12:00:00 AM
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే చాలా గ్రామాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సూచనలు బేఖాతరు చేస్తున్న అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అయితే ఎన్నికల కమిషన్ సూచించిన నియమాల ప్రకారం.. ఒక గ్రామంలో 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ. 2.5 లక్షలు.. 5 వెల కంటే తక్కువ జనాభా ఉంటే రూ. 1.5 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి.
అలాగే చేసిన ఎన్నికల ఖర్చులను 45 రోజుల్లోపూ సమర్పించాలి. ఈ పరిమితి దాటితే నివేదిక సమర్పించడంలో విఫలమయితే మూడు సంవత్సరాల వరకు పోటీ చేయడానికి వీలు ఉండదు. నేటి ప్రజాస్వామ్యం గ్రామీణ వ్యవస్థ పునాది. అధికారిక లెక్కలకు, అభ్యర్థులు ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది.
ప్రజాస్వామ్యం ధన స్వామ్యం అయింది.దీనిపై నిందించాల్సింది నాయకుల్ని కాదు. దీనికి ప్రజలే బాధ్యులు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, నిజాయితీగా పనిచేసే వ్యక్తులను ఎన్నుకోవాలి. ఓటర్లు నిజాయితీగా ఉంటే నిజమైన ప్రతినిధులు ఎన్నికవుతారు.
ఉమాశేషారావు వైద్య, దోమకొండ