calender_icon.png 11 December, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రిడిటేషన్‌కు సంబంధం లేకుండా ఎన్నికల పాసులు జారీ చేయాలి

09-12-2025 03:43:19 PM

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): వార్త సేకరణ కోసం పంచాయతీ ఎన్నికల్లో అక్రిడేషన్ కార్డుకు సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులకు పాసులు జారీ చేయాలని టీయూడబ్ల్యూజే ( ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కలెక్టరేట్ కార్యాలయ ఏ ఓ కిరణ్ కీ కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ  చేయకపోవడంతో చాలామంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు లేవన్నారు.

దీంతో చాలామంది వర్కింగ్ జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అక్రిడేషన్ కార్డులు లేని వర్కింగ్ జర్నలిస్టులకు పంచాయతీ ఎన్నికల పాసులు జారీ చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ( ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ప్రకాష్ గౌడ్, ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీనివాస్ రావు, జర్నలిస్టులు సురేష్ చారి, రాధాకృష్ణ చారి, రాంబాబు, రవీందర్, ఎన్ మినేష్, అవినాష్ , మోయిన్, సీ హెచ్ చేతన్, రాందాస్ , ముబశిర్ , మిలిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.