09-12-2025 03:40:21 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దీక్షా విజయ్ దివస్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన లో భాగంగా 2009లో 11 రోజులపాటు ఆమరణ దీక్ష చేపట్టి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడేలా చేసిన తెలంగాణ ఉద్యమ సారథి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్యాగాన్ని నాయకులు గుర్తు చేశారు.
విజయ్ దివస్ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్ , రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, బుర్స పోచన్న పూలమాలలు వేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ గారు, నిసర్, చిలువేరు వెంకన్న, పొన్నాల నారాయణ, దుడల అశోక్, జావెద్, సాజిద్, అన్సార్,రవి, సాలాం, చందు తదితరులు పాల్గొన్నారు.