19-10-2025 08:43:25 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ నక్కలగుట్టలోని మారుతి అపార్ట్మెంట్స్ లో ఆదివారం హనుమకొండ జిల్లా శాఖ ట్రైసిటీ అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించిన అనంతరం 2025-27 సంవత్సరానికి డాక్టర్ రెంటాల కేశవరెడ్డి అధ్యక్షులుగా, నడుముల విజయ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, శ్రీరంగ ప్రభాకర్ ప్రధాన కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ రెంటాలకేశవరెడ్డి మాట్లాడుతూ ట్రై సిటీస్ అపార్ట్మెంట్‌లలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం త్వరలో స్థానిక శాసనసభ్యులు, మేయర్ లని కలిసి సమస్యలను వివరించి, పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
అదేవిధంగా మమ్మల్ని మరోసారి విశ్వసించి గెలిపించిన ట్రై సిటీస్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అని తెలిపారు. అనంతరం కొత్తగా ఎన్నుకోబడిన వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి లు మాట్లాడుతూ ట్రై సిటీస్ అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ట్రై సిటీస్ అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా నిలిచింది. సామాజిక కార్యకర్తగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవల డాక్టర్ అవార్డు అందుకున్నారు. గతంలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘంలో పనిచేసి, తరువాత గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘంలో సైతం సేవలు అందించిన మేధావి కేశవరెడ్డి ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నుకోబడిన ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రెటరీ, కార్యవర్గ సభ్యులు, వివిధ అపార్ట్మెంట్ల అధ్యక్షులు కార్యదర్శిలు, తదితరులు పాల్గొన్నారు.