calender_icon.png 6 August, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలి

06-08-2025 01:39:04 AM

  1. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు 
  2. రాజకీయ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ నానా యాగీ 
  3. బీసీలతో ఆ పార్టీది క్రూరమైన పరిహాసం
  4. కాళేశ్వరం నివేదికలో మొత్తం గ్యాస్, ట్రాష్ 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  6. ఈసీతో సమావేశమైన బీఆర్‌ఎస్ ప్రతినిధులు

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): బ్యాలెట్ పద్ధతిలోనే అన్ని ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.అభివృద్ది చెందిన ఎన్నో దేశాలు ఈ వీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చే సి తిరిగి పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతిని గుర్తు చేశామన్నారు.

మంగళవారం ఢిల్లీలోని ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం భేటీ అయింది.  ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ న వంబర్‌లో జరిగే బీహార్ ఎన్నికలతోనే పేపర్ బ్యాలెట్‌ను ప్రవేశపెట్టి, తరువాత జరిగే సా ధారణ ఎన్నికలనూ బ్యాలెట్‌తోనే నిర్వహించాలని సూచించామన్నారు.

కారు గుర్తును పోలిన గుర్తులతో బీఆర్‌ఎస్‌కు జరుగుతున్న నష్టాన్ని వివరించి తక్షణమే వాటిని తొలగించాలని కోరినట్టు తెలిపారు. బీహార్‌లో జరు గుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వస్తున్న అనుమానాలు, ఆందోళనలను తొ లగించాలని కోరామన్నారు. 

హామీలు అమలు చేయకుంటే శిక్షించాలి

ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు, అడ్డగోలు వాగ్దానాలపై కూడా ఈసీతో చర్చించా మని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూ పించి 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారన్నారు. అధికారంలోకి వచ్చాక ఎలా తప్పించుకుంటుందో ఎన్నికల సంఘానికి వివరించామన్నారు. పార్టీలు తమ మేనిఫెస్టోకి కట్టుబడి ఉండకపోతే వారిని శిక్షించే బాధ్యత, అధికారం ఈసీకి ఉందని పేర్కొన్నా రు.

ఎన్నికల్లో ప్రజల్ని వంచించే ఏ పార్టీ అ యినా మోసం చేస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేసి,  ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేకుం డా అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈసీ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్య టించి ప్రజలు, ఎన్జీవోలు, ప్రజాసంఘాలతో చర్చించాలని సూచించినట్లు తెలిపారు. హై దరాబాదులో అందర్నీ పిలిచి మాట్లాడి అభిప్రాయాలు తీసుకొని సంస్కరణలు తీసుకు రావాలని చెప్పామన్నారు. ఈసీ అన్నీ విందని, సలహాలు ఫిర్యాదులు ఉంటే తెలియజేయాలని చెప్పినట్లు వివరించారు. 

కాంగ్రెస్‌ది క్రూరమైన పరిహాసం

బీసీలతో కాంగ్రెస్ పార్టీ క్రూరమైన పరిహాసం ఆడుతోందని, అసెంబ్లీలో బిల్లు పెట్టి నప్పుడే తాము చెప్పామని కేటీఆర్ అ న్నా రు. 42శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీలో కాంగ్రె స్ డ్రామా చేస్తున్నదని బీసీ డిక్లరేషన్‌ను అ మలుచేయకుండా ఆ పార్టీ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. సంవత్సరానికి రూ. 20వేల కోట్ల బడ్జెట్, ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్‌ను, బీసీ సబ్ ప్లాన్, ఉద్యోగ, ఉపాధి,  కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారన్నారు.

తమ చేతుల్లో ఉన్న ఈ పను లు చేయకుండా తమ చేతుల్లో లేని రాజకీయ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ నానా యాగీ చేస్తున్నదని మండిపడ్డారు. రాజకీయాల్లో 42 శాతం వాటా వస్తే రాజకీయ నాయకులకే లాభమన్నారు. కాంగ్రెస్ ఆడుతున్న దొంగ నాటకాన్ని బీసీలు అర్థం చేసుకున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు.

కాళేశ్వరం నివేదిక గ్యాస్, ట్రాష్

కాళేశ్వరం నివేదికలో మొత్తం గ్యాస్, ట్రా ష్ మాత్రమే తప్ప అందులో ఏమీ లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌పై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ దుష్ర్పచారం చేస్తుందని మం డిపడ్డారు. కేటీఆర్, మైకులు కట్ చేయకుం డా తమను అసెంబ్లీలో మాట్లాడనిస్తే ప్రభుత్వంతో ఫుట్‌బాల్ ఆడుకుంటామని వ్యాఖ్యా నించారు. 665 పేజీల  కమిషన్ నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే కాంగ్రెస్ భాగోతం అర్థమైందని, ఆ పేజీల్లో మాత్రమే వారికి ఇష్టమైనవి ఉన్నాయన్నారు.