calender_icon.png 31 January, 2026 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సవ విగ్రహాలుగా విద్యుత్ స్తంభాలు!

31-01-2026 01:53:13 AM

అటవీ శాఖ అడ్డంకులు.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు

త్రీఫేజ్ విద్యుత్ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు

ఉట్నూర్, జనవరి 30 (విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని గిరిజన రైతుల కు  సాగునీటి సౌకర్యం కల్పించేందుకు మం జూరైన బోరు బావులు తవ్వుకొని... విద్యుత్ సౌకర్యం కోసం రైతులు ఎదురు చూస్తున్నా రు. ఐటిడిఏ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిరికొండ, నార్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్ తదితర మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల రైతులకు ‘ఇంద్రజల ప్రభ‘ పథకంలో ప్రభుత్వం బోరు బావులు మంజూ రు చేసింది. బోరు బావులు మంజూరైన రైతు లు సాగునీటిని సద్విని చేసుకునేందుకు విద్యు త్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కోసం రైతుల వారిగా డీడీ లు చెల్లించారు.

డీడీలు చెల్లించిన రైతులకు విద్యుత్ శాఖ అధికారులు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించుటకు పనులు ప్రారంభించి స్తంభాలు వేశారు. తీరా వేసిన స్తంభాలకు త్రీఫేజ్ విద్యుత్ తీగలను ఏర్పాటు చేస్తున్న సమయంలో అటవీ శాఖ అధికారులు అనుమతి లేనిది విద్యుత్ తీగలు ఏర్పాటు చేయరా దని అడ్డుకున్నారు. అనుమతి లేక విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో మారుమూల గిరిజన గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ భూములకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కలుగుతుం దన్న ఆశలు అడియాశలు అయ్యాయి.

త్రీఫేజ్  విద్యుత్ సౌకర్యం ఏడాదిగా మూలన పడింది. తమ వ్యవసాయ చేనులో వేసిన బోర్లతో యాసంగి పంటల సాగు చేసుకోలేకపోతున్నామని, విద్యుత్ సౌకర్యం కల్పించుటకు వేసిన స్తంభాలు వ్యవసాయ చేనులో ఉత్సవ విగ్రహాలుగా  దర్శనమిస్తున్నాయని రైతులు అంటు న్నారు. త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని జిల్లా ఉన్నత అధికారులతో పాటు మండల, డివిజన్ స్థాయి అధికారులకు విన్నవించిన నేటికీ పనులు ముందు సాగడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు  గిరిజన రైతులపై కనుకరించి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యే విధం గా చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

అటవీ శాఖ అనుమతిస్తే పనులు: రోహిదాస్ జాదవ్, ఇన్‌చార్జి ఏడి

ఉట్నూర్ డివిజన్ పరిధిలోని సిరికొండ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాలతోపాటు పలు మండలాల పరిధిలోని మారు మూల గిరిజన గ్రామాల రైతులు దాదాపుగా 300 మందికిపైగా త్రీఫేస్ విద్యుత్ సరఫరా కోసం దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు.  గిరిజన రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పించుటకు  సాంకేతిక మంజూరు తీసుకొని పనులు ప్రారంభిస్తే అడవి శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు.. అటవీ శాఖ అధికారులు అనుమతిస్తే వెంటనే పనులు పూర్తి చేసి త్రీ పేజ్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.

ఏడాదిగా పనులు నిలిచిపోయాయి..

అదిలాబాద్ రూరల్ మండలంలోని అల్లికోరి పంచాయతీ పరిధిలోని పొటంలొద్ది, అల్లికోరి గ్రామాలకు చెందిన గిరిజన రైతులు సొంత డబ్బులతో 36 మంది వ్యవసాయ బోర్లు వేసుకున్నారు. విద్యు త్ సౌకర్యం కోసం డీడీలు చెల్లించిన తర్వా త విద్యుత్ సరఫరా పనులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ తీగలు బిగించే సమ యంలో అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఏడాదిగా బోర్లు వేసుకొని త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కోసం గిరిజన రైతు లు ఎదురుచూ స్తున్నారు. అధికారుల దృష్టి కి తీసుకువెళ్లిన నేటికీ సమ స్య పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ పట్టా భూ ముల్లో విద్యుత్ స్తంభాలు వేసుకుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం బాధగా ఉందన్నా రు. అధికారులు స్పందించి త్రీఫేస్ విద్యుత్ సరఫరా అయ్యే విధంగా కృషి చేయాలి.

మెస్రం గంగుపటేల్, సర్పంచ్ అల్లికోరి

సర్వే చేసి అనుమతి ఇస్తాం: సంతోష్, ఎఫ్‌ఆర్‌ఓ

ఇంద్రవెల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని అల్లికోరి  గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యంపై అటవీ శాఖ ఆధ్వర్యంలో సర్వేలు చేసి, త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించే విధంగా ఉన్నత అధికారులకు నివేదికలు పంపిస్తాం. ఉన్నతాధికారులచే ఆదేశాలు రాగానే త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కోసం తమ శాఖ ఉద్యోగులు ఎవ్వరూ అడ్డుకోరని స్పష్టం చేశారు.